Uncategorized ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవం నిర్వహణ… PRAJA DHOOTHA BOSSSeptember 17, 20250133 views ఆంధ్ర విశ్వవిద్యాలయం, ప్రజా దూత ప్రతినిది :సెప్టెంబర్ 17: ఆంధ్ర విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్నేషనల్ మైక్రో ఆర్గానిజం డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే, కీడు చేసే రెండు విధాల సూక్ష్మజీవులు ఉంటాయని చెప్పారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన ఒక బ్యాక్టీరియా మెదడుపై ప్రభావం చూపడం దీని ఫలితంగా కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తున్న సంఘటనలు మనం చూస్తున్నామని చెప్పారు. ఇటువంటి అంశాలు యువతకు ఒక నూతన సవాలుగా నిలుస్తాయని, ఇటువంటి మానవ ఉపయుక్త అంశాలపై పరిశోధనలు చేయాలని సూచించారు. తరగతి గదిలో పుస్తకాల నుంచి పొందిన జ్ఞానానికి ప్రయోగశాలలో ప్రత్యక్షంగా నేర్చుకునే విధానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. ఈ సదస్సులో నిపుణుల ప్రసంగాలు యువతలో ప్రేరణ కలిగించడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ శతాబ్ది సంవత్సరంలో మైక్రో బయాలజీ విభాగం 25 సంవత్సరాల పూర్తి చేసుకోవడం సంతోషదాయకమని చెప్పారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ మానవ ఆరోగ్యం బయోలాజికల్, సైకలాజికల్ అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. సూక్ష్మజీవుల ప్రపంచంపై విస్తృతమైన అవగాహన ప్రజల్లో పెరుగుతోందని అన్నారు. అదే సమయంలో శరీరానికి మెదడుకు ఉన్న సంబంధాన్ని కూడా తెలుసుకోవడం, పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించడం ఎంతో అవసరమని చెప్పారు. విభాగాధిపతి ఆచార్య సుధాకర్ మాట్లాడుతూ విద్యార్ధులను వర్తమాన అంశంపై అవగాహన కల్పించే విధంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిపుణుల ప్రత్యేక ప్రసంగాలు విద్యార్థులకు నూతన పరిశోధనల దిశగా ఆసక్తిని కలిగిస్తూ వారిని నడిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐ సి ఏ ఆర్- సి ఐ ఎఫ్ టి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అహ్మద్ బాష గట్ మైక్రోబీటా మాడ్యులేషన్ ఫర్ హెల్త్ మేనేజ్మెంట్ అనే అంశంపైన, సవీతా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ధన శేఖర్ శక్తివేల్ పారాసైట్ కంట్రోల్ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు ఎంతో ఆసక్తిని కలిగించే విదంగా మైక్రోట్స్ పై యానిమేటెడ్ వీడియోలను, నిత్యజీవితంలో మనకి అనుభవం పొందే మైక్రోట్స్ లో విద్యార్థులకు ప్రత్యక్షంగా శిక్షణ అందించారు. మైక్రోస్కోప్ లో వివిధ సూక్ష్మజీవులను వీక్షించే అవకాశం విద్యార్థులకు కల్పించారు. చివరగా అత్యుత్తమ పోస్టర్లను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. *కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, విభాగాచార్యులు డాక్టర్ హరివుడైనంబి సినిదామీ. డాక్టర్ పి. లక్ష్మి, డాక్టర్ పి. రాజు రమేష్ కుమార్, ఆచార్య పద్ధయ్య ఆచార్య వి. లక్ష్మి, ఆచార్య పి.రాధిక తదితరులు ప్రసంగించారు. గాయత్రీ విద్యాపరిషత్ ఎమ్.ఎల్.బి.టి. పాఠశాల, గ్యానోదయ ఆర్.సి.యమ్. మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లిష్ మీడియం తదితర పాఠశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.