Uncategorized ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్? PRAJA DHOOTHA BOSSJanuary 9, 202609 views అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు లేక పోలేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు జనగణన పూర్తయిన తర్వాతే జరుగుతాయని రాష్ట్ర మంత్రి నారాయణ సంకేతం ఇచ్చారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశాలు లేదని, 2027 లో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినప్పటికి జనగణన అంశం తెరపైకి రావడంతో ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి.