Uncategorized పదవ తరగతి విద్యార్థులకు ‘దివీస్’ భరోసా: రూ. 8.50 లక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ PRAJA DHOOTHA BOSSJanuary 9, 2026011 views మధురవాడ: పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం. ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా చినగదిలి మండలం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.దివీస్ లేబోరేటరీస్ భారీ సాయం:ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లేబోరేటరీస్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు 30 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2600 మంది విద్యార్థుల కోసం ₹8,50,000 విలువైన సామాగ్రిని అందించింది. ఇందులో భాగంగా 2026 వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న చంద్రంపాలెం పాఠశాలలోని 147 మంది విద్యార్థులకు DCEB ప్రచురించిన ఆల్-ఇన్-వన్ మెటీరియల్, పెన్నులను డీఈఓ చేతుల మీదుగా అందజేశారు.సద్వినియోగం చేసుకోవాలి:విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ సహకారం అందిస్తున్నామని, విద్యార్థులు ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్తమ మార్కులతో విజయం సాధించాలని దివీస్ ప్రతినిధి టి. సురేష్ కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుదే అచ్యుతరావు, ప్రధానోపాధ్యాయులు మొలుగు వెంకటరావు, కమిటీ సభ్యులు అప్పలరాజు, స్వప్న, డీసీఈబీ ప్రతినిధులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ ఆర్థిక సాయం అందించిన దివీస్ యాజమాన్యానికి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.