పర్యాటక రంగ ప్రదాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్

తాటిపూడిలో రెండో దశ బోట్ షికార్ ప్రారంభం


విజయనగరం, డిసెంబర్ 27; ప్రజాదూత ప్రతినిది : జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకొస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్‌లో పర్యాటక శోభను పెంచే దిశగా ఆయన శనివారం రెండో దశ బోటు షికారు కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.
జిల్లా పర్యాటక శాఖ సహకారంతో ‘వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ఏర్పాటు చేసిన 10 నూతన బోట్లు, రెండు టూరిజం స్టాళ్లను మంత్రి ప్రారంభించి, పర్యాటకులకు మరిన్ని వినోద సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక బోట్లు:
పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా మంత్రి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ క్రింది బోట్లను అందుబాటులోకి తెచ్చారు:

  • వాటర్ ట్యాక్సీ: 19 సీట్ల సామర్థ్యం
  • స్పీడ్ బోట్: 6 సీట్ల సామర్థ్యం
  • గల్ఫ్ బ్రిడ్జ్ బోట్: 12 సీట్ల సామర్థ్యం
  • ఓషన్ కయాక్ బోట్లు: 4 (తలా 2 సీట్లు)
  • వాటర్ రిక్షాలు: 2
  • వర్లాండో బోట్: 6 సీట్ల సామర్థ్యం

    పర్యాటకమే ప్రగతి పథం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. “అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధిని కల్పించే శక్తి పర్యాటక రంగానికి ఉంది. తాటిపూడిని పర్యాటక హబ్‌గా మార్చడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యం,” అని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఈ బోట్ షికారును ఆస్వాదించాలని ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి గారి చొరవతో తాటిపూడి రిజర్వాయర్ ఇప్పుడు పర్యాటకుల పాలిట స్వర్గధామంగా మారుతోంది. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, సాగునీటి సంఘం ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొని మంత్రి కృషిని కొనియాడారు.

Related posts

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం. భక్తుల్లో ఆందోళన.

సబ్ హెడ్: జి.ఓ. 36 అమలు చేయాలని డిమాండ్.. 2011 నుండి డివిడెండ్ చెల్లింపులపై పోరు.

పదవ తరగతి విద్యార్థులకు ‘దివీస్’ భరోసా: రూ. 8.50 లక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ