Uncategorized శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం. భక్తుల్లో ఆందోళన. PRAJA DHOOTHA BOSSJanuary 9, 2026015 views తిరుమల:తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున మార్గంలోని 400వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తుల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భక్తులను ఒంటరిగా అనుమతించకుండా, గుంపులు గుంపులుగా పంపిస్తూ నిరంతరం నిఘా ఉంచుతున్నారు. నడకమార్గంలో వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.