Uncategorized సబ్ హెడ్: జి.ఓ. 36 అమలు చేయాలని డిమాండ్.. 2011 నుండి డివిడెండ్ చెల్లింపులపై పోరు. PRAJA DHOOTHA BOSSJanuary 9, 2026017 views విజయనగరం ;(ప్రజాదూత ప్రతినిధి):సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీనతను నిరసిస్తూ ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన బాట పట్టింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో విధులను బహిష్కరించి, రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ప్రధాన డిమాండ్లు ఇవే: జీతభత్యాలు – పీఆర్సీ: జి.ఓ. నెం. 36ను తక్షణమే అమలు చేసి, డి.ఎల్.ఎస్.ఎఫ్ (DLSF) ద్వారా ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి జీతాలు చెల్లించాలి. 2019, 2024 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలను (PRC) వెంటనే చేపట్టి, అంతవరకు మధ్యంతర భృతి ప్రకటించాలి. ఉద్యోగ క్రమబద్ధీకరణ: 2019 తర్వాత నియామకమైన తాత్కాలిక ఉద్యోగులను, వారి పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. రిటైర్మెంట్ వయస్సు: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సహకార సంఘాల సిబ్బందికి కూడా పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. భద్రత మరియు భీమా: ఉద్యోగులకు కనీసం 5 లక్షల ఆరోగ్య భీమాతో పాటు, సర్వీసులో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండేలా 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలి. గ్రాట్యుటీ సీలింగ్: ప్రస్తుతం విధిస్తున్న 2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్‌ను తొలగించి, చట్టప్రకారం చెల్లింపులు జరపాలి.రైతులకు న్యాయం చేయాలి:గత ఆరేళ్లుగా సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందడం లేదని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీబీలు నేరుగా రుణాలు ఇవ్వడం వల్ల పీఏసీఎస్ (PACS) వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, దీనిని మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే 2011 నుండి రైతులకు మరియు సొసైటీలకు రావాల్సిన డివిడెండ్లను 6 శాతం వడ్డీతో కలిపి తక్షణమే చెల్లించాలని కోరారు.కమిటీ బాధ్యత వహించాలి:ఉద్యోగుల మార్పులు, చేర్పులు మరియు రిక్రూట్‌మెంట్ల విషయంలో డీఎల్ఈసీ (DLEC) కమిటీ పూర్తి బాధ్యత వహించాలని, సీనియార్టీ ప్రాతిపదికన ఏఈ (AE) లకు సీఈఓ (CEO)లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఉద్యమ కార్యాచరణ:తమ డిమాండ్లపై ఎస్.ఎల్.ఇ.సి (SLEC) తక్షణమే చర్చలు జరపాలని, లేనిపక్షంలో సంఘ కార్యకలాపాల్లో పాల్గొనబోమని, కంప్యూటర్ వర్క్ నిలిపివేసి నిరసనలు ఉధృతం చేస్తామని ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధులు స్పష్టం చేశారు.నిన్న జరిగిన నిరహార దీక్షలో గంట్యాడ CEO G అప్పలనాయుడు బోనంగి CEO B శంకరప్రసాద్ , PSR పురం CEO K సూర్యవెంకటరావు, జొన్నవలస CEO నరేంద్ర, జొన్నాడ CEO P శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు