Celebrity Entertainment ANR కళాశాలకు నాగార్జున రూ.2కోట్ల విరాళం PRAJA DHOOTHA BOSSDecember 17, 20250171 views ప్రజా దూత ;ప్రతినిది :కృష్ణా జిల్లాలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేందుకు ఆయన రూ.2 కోట్లు ఉపకార వేతనాల కోసం విరాళంగా ప్రకటించారు. వేడుకల్లో మాట్లాడిన నాగార్జున, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి స్మరించుకున్నారు. ‘‘మా తండ్రి నాగేశ్వరరావు చదువుకోకపోయినా, చదువుపై ఆయనకు అపారమైన ప్రేమ ఉండేది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు బంగారు వెలుగులు నింపేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు. 1959లో ఏఎన్నార్ కళాశాలకు ఆయన రూ.లక్ష విరాళం ఇచ్చారు’’ అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపగా, నాగార్జున ప్రకటించిన భారీ విరాళం కళాశాల అభివృద్ధికి దోహదం చేయనుంది.